తాడి చెట్టుపై నుంచి పడి గీతన్నకు తీవ్రంగా గాయాలు

Mar 17, 2024 - 20:58
 0  49
తాడి చెట్టుపై నుంచి పడి గీతన్నకు తీవ్రంగా గాయాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ తాటి చెట్టు పై నుండి పడిన గీత కార్మికుడు యరగాని వెంకన్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన యరగాని వెంకన్న తండ్రి పుల్లయ్య వయస్సు (54) సంవత్సరాలు అనే గీత కార్మికుడు తేది:16.03.2024 శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడటంవల్ల మెడ నరాలు కట్టు అయినవి కాళ్లు చేతులు కదలటం లేదు పైకి లేవడం లేవు ప్రమాదకరంగా మారినది అక్కడక్కడ బలమైన గాయాలు తగిలి స్పృహ కోల్పోవడంతో 108 ద్వారా సూర్యాపేట హాస్పిటల్ తరలించగా సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని *తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు జిల్లా ఉపాధ్యక్షులు అబ్బ గాని బిక్షం జిల్లా కమిటీ సభ్యుడు మరియు సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తండ రమేష్ మండల అధ్యక్షుడు కార్యదర్శి నోముల వెంకన్న బెల్లంకొండ ఇస్తారి సొసైటీ అధ్యక్షులు కాట్ల వెంకన్న డిమాండ్ చేశారు.