మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

Jul 7, 2024 - 19:51
Jul 7, 2024 - 19:56
 0  31
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

సూర్యాపేట 08 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీస్ ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవం వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి 59వ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సభఅధ్యక్షతన నియోజకవర్గ ఇన్చార్జ్ ములకలపల్లి రవిమాదిగ నిర్వహించారు ఈ సమావేశం లో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ జరిగింది జెండాను MRPS జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ ఆవిష్కరించడం జరిగింది

 ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు యతాకుల రాజన్న మాదిగ హాజరై సంయుక్తంగా మాట్లాడుతూ 1994 సంవత్సరంలో ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడింది కానీ సమాజంలో అసమానతలు మీద సామాజిక కార్యక్రమాలు చిన్నపిల్లలకు గుండె జబ్బుల కోసం దీక్షలు ధర్నాలు చేసి ఆరోగ్యశ్రీ సాధించాడు అలాగే ఒంటరి మహిళల కోసం వికలాంగుల వితంతుల పెన్షన్ల పెంపు కోసం పోరాడిన మానవతావాది మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు ఎస్సీలలోని మాదిగ 59 ఉపకులాలకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా ఎవరి జనాభా ఎంతో వారి వాటాకు అంతే రావాలని అప్పుడే సామాజిక ఆర్థిక రాజకీయంగా ఎదగలమని అని చెప్పారు

ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర నాయకులు వీరస్వామి ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు జిల్లా ఎమ్మెస్పీ నాయకులు బోడ శ్రీరాములు దాసరి వెంకన్న విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు చింత సతీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి ప్రచార కార్యదర్శి మొలుగురి రాజు ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షుడు మేడికృష్ణ చివ్వెంల మండల అధ్యక్షుడు సిరిపంగి నవీన్ పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు కొండేటి గోపి చెరుకుపల్లి సతీష్ మారపల్లి ప్రభాకర్ మహిళ నాయకురాలు మారపల్లి సావిత్ర మామిడి సంధ్య మామిడి విజయ్ చింతా నవీన్ చెరుకుపల్లి మైకేల్ మిరియాల చిన్ని బుసిపాక సాయితేజ కాటపల్లి సందీప్ చింత సాంబయ్య  ఆరెంపులవెంకటాద్రి పంతం గురువయ్య మొండికత్తి జానకిరాములు బొడ్డు నవీన్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333