*మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
**మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*
**మణుగూరు ఎంఈఓ కి వినతి పత్రం**
తెలంగాణ వార్త మణుగూరు ప్రతినిది జూన్ 21:-
సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో. మణుగూరు meo గారికి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చారుcitu జిల్లా ఉపాధ్యక్షురాలు జిలకర పద్మ మాట్లాడుతూ. రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నాయని. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను. తక్షణమే అమలు చేయాలని. పదివేల రూపాయలు గౌరవ వేతనం. సపరేటు గుడ్లు బిల్లులు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు. ఈనెల 24వ తారీఖున జరగబోయే కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కార్మికులు కోరారు. సిఐటి జిల్లా నాయకులు సత్ర పల్లి సాంబశివరావు. మధ్యాహ్నం భోజనం అధ్యక్ష కార్యదర్శులు. శైలజ. అరుణ. మునెమ్మ. సీతమ్మ. నాగమ్మ లక్ష్మి మరి కొంతమంది పాల్గొన్నారు