మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి

Sep 8, 2026 - 19:51
 0  1
మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

జోగులాంబ గద్వాల8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల జిల్లాలోని ప్రజలందరు మట్టి, సహజ రంగులతో చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మట్టి వినాయక విగ్రహాల పంపిణి కార్యక్రమంను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ క్యాంప్ కార్యాలయం వద్ద సంబంధిత అధికారులతో కలిసి గోడ పత్రికలను, మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టర్ అఫ్ పారిస్, రసాయన రంగులతో చేసిన వినాయక విగ్రహాలను చెరువులలో, నదులలో నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితం అయి, నీటి కాలుష్యం తద్వారా పర్యావరణ కాలుష్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువత సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పర్యావరణ శాస్త్రవేత్త విద్యుల్లత, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయరాజ్, తదితరులున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333