భువనగిరి పోరు గడ్డ ఎర్రజెండా అడ్డ

Apr 18, 2024 - 20:42
Apr 18, 2024 - 20:50
 0  233
భువనగిరి పోరు గడ్డ ఎర్రజెండా అడ్డ

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారసుడు ఎండి జహంగీర్ ను గెలిపించండి. 

పోరు గడ్డలో సిపిఎం గెలుపు ఖాయం... సిపిఎం, కాంగ్రెస్ మధ్యనే పోటీ...... 

విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి

 కేంద్రంలోని బిజెపిని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ఓడించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి.

తిరుమలగిరి 19 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణరైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారసుడైన సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి పట్టణ కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులైన రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, తొట్ల మల్సూర్, బొడ్డు గంగులు, పోరెల్ల దాసు, ఏశ బోయిన ఎల్లప్ప వారసుడుగా పోరాటాల పురిటి గడ్డైన ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా సిపిఎం పార్టీకి చెందిన ఎండి జహంగీర్ పోటీ చేస్తున్నారని అన్నారు.త్యాగాలకు పునీతమైన తుంగతుర్తి నియోజకవర్గంలోఅధిక మెజార్టీని తీసుకురావాలని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే దేశము ఐక్యంగా ముందుకు పోతుందని ప్రజల మధ్యన ఐక్యత పెరుగుతుందని ఈ ఐక్యతను దెబ్బతీయడానికి మోడీ బిజెపి ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగం కాపాడాలంటే దేశంలో బిజెపిని ఓడించాలని తెలియజేశారు. బిజెపి అధికారం చేపట్టిన ఈ పది సంవత్సరాల కాలంలో దళితులు గిరిజనులు మహిళలు అనేక దాడులకు గురవుతున్నారని వారి పైన హత్యలు, అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వెలిబుచ్చారు.బిజెపి అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల ఫలితంగా విపరీతమైన ధరలు పెరిగి నిత్యవసర ధరలు సామాన్య ప్రజలు కొని తినే పరిస్థితిలో లేరని రోజుకు ఆకలి దారిద్రం పెరిగిపోతుందని ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గిందని అన్నారు. దీనితో రైతులు గ్రామాలలో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం అవినీతిని చట్టబద్ధత చేసిందని అవినీతి చేసిన వారు బిజెపిలో చేరితే నీతిమంతులు అవుతున్నారని ఇది ఎట్లా కరెక్ట్ అని వారు ప్రశ్నించారు. మరో పక్క ప్రశ్నించు వారిని ఎదిరించే వారిని హక్కులను అడిగే వారిని నిర్బంధాలు మోస్తూ వారి మీద తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతుల గురి చేస్తూ జైల్లో పెడుతున్నారని వారు ఆవేదన వెలిబుచ్చారు. భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం,కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపిని అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఒకటై ఓడించాలని దేశంలో సిపిఎంను గెలిపించాలని ప్రజలను కోరినారు.బోనగిరి పార్లమెంటు పోటీ చేసిన కాంగ్రెస్ ,బిజెపి ,బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు అడిగే నైతిక హక్కు విలువలు లేవని వారు ఏనాడు కూడా ప్రజల పక్షాన పోరాటాలుచేయలేదని ఆరోపించారు. ప్రధానంగా వారి ఆస్తులను కాపాడుకోవడానికి వారి దగ్గర ఉన్న డబ్బులను వెదజల్లి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సిపిఎం పార్టీగా అనేక ఉద్యమాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధితో పాటు భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేశామని అన్నారు.సాగు, తాగునీరు, విద్య,వైద్య,ఉపాధి,మూసీ జల కాలుష్యం నివారించాలని పాదయాత్రలు ధర్నాలు పికటింగులు అనేక ఉద్యమాలు కొనసాగించి ప్రజల పక్షాన నిలబడి నేటికీ ఉద్యమాలకు కొనసాగిస్తున్నామని తెలియజేశారు.   సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గం పై సమగ్ర అవగాహనతో జహంగీర్ ఉన్నారని అన్నారు.అన్ని రంగాల్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో ప్రజల పక్షాన ప్రశ్నించాలంటే ప్రజల పక్షాన పోరాడే జహంగీర్ కు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ విలేకరులసమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు, కోట గోపి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం,కొప్పుల రజిత,సిపిఎం తిరుమలగిరి అర్వపల్లి మండల కార్యదర్శి లు గుమ్మడవెల్లి ఉప్పలయ్య, వజ్జా శ్రీనివాస్, నాయకులు కడారి లింగయ్య,వనం సోమయ్య,దేవరకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034