భావితరం స్వేచ్ఛా ప్రధాత...మరువము నీ చరితా...

అణగారిన జాతికి ఆశా కిరణమా
అభ్యుదయ జ్యోతివి నీవే అంబేద్కరుడా...
బడుగు బలహీన వర్గ బంధమా
అడుగడుగున వర్ణ వివక్ష సాక్ష్యమా....
||అణగారిన||
అమ్మ నిన్ను కన్నది నిమ్న జాతి అభ్యున్నతి కొరకే..
నాన్న నీకు నేర్పేను ఓర్పుతో నెగ్గడమెలాగో...
అంబేద్కర్ గురువు వేసెను
భావి తరాల బాధను తీర్చే బాటలను...
అందుకు ఆతని పేరుతో బాబా సాహెబ్ అంబేద్కర్ గా చరిత్ర లిఖించితివి...
||అణగారిన||
అంటరానివారంటూ ఊరిబయట
ఉంచిన పెత్తందారి పాలనలో....
కనివినీ ఎరుగని కుల వివక్ష
కుట్రలలో నలిగి వెలిగితివి....
అవస్థలన్నీ ఆహ్వానించె వ్యవస్థ
మార్చే వ్యక్తే నీవంటూ...
అ బాధే నీకు తోడయ్యి
నీలో అంతర్మధనం మొదలయ్యే....
నర నరం నరక యాతనలో జాతిని
జాగృత పరచగ కదిలావయ్యా....
||అణగారిన||
అవమానాలు, అవహేళన లు ఎన్నిటినో
పంటి బిగువున భరియించి..
మార్పేదైనా విద్యతోనే సాధ్యమని
కసితో, కన్నీళ్లతో బారిస్టరు చదివి ...
రాజ్యాంగ కర్తగా అందరి కన్నీళ్లు
తుడిచిన మహనీయుడా.....
సమాజాన్ని సమూలంగా మార్చే
సంకల్పం చేసి....
సామాన్యుడు సగర్వంగా తలెత్తే
యజ్ఞం చేసిన మహోదయుడా.....
పౌరుల హక్కులు హరించని
స్వేచ్చా జీవన పథాన్ని
మాకందించిన మాన నీయుడా...
ఓ... అంబేద్కరుడా.....
||అణగారిన||
నాడు ఒంటరిగా కదిలి
నేడు వందలు వేలుగా మారావు....
ఊరికొక్క అంబేద్కర్ ఉదయించే
నీ స్ఫూర్తితో....
యువతరం ఉరకలు వేసే
వాడ వాడ నీ చైతన్యం తో....
భావితరం స్వేచ్ఛా ప్రధాతా...
మరువము నీ చరితా..
ఓ..మహనీయుడా...
ఓ..అంబేద్కరుడా.....
||అణగారిన||
భీమనాతి శారద
ప్రభుత్వ గణిత ఉపాధ్యాయురాలు
కరీంనగర్