భవన నిర్మాణ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తుంగతుర్తి ఫిబ్రవరి 9 తెలంగాణ వార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండల ఆర్యవైశ్య భవన నిర్మాణ నూతన కమిటీ ఆదివారం రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఓరిగంటి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు ఓరుగంటంతయ్య అధ్యక్షతన సంఘం సభ్యులచే నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
భవన నిర్మాణ కమిటీ నూతన అధ్యక్షుడిగా పాలవరపు సంతోష్ ప్రధాన కార్యదర్శిగా తల్లాడ కేదారి కోశాధికారిగా బుద్ధా వీరన్న సహాయ కార్యదర్శులుగా గుమ్మడవెల్లి శ్రీనివాస్ తల్లాడ శ్రీనివాస్ గుమ్మడవెల్లి సోమన్న ఓరుగంటి శ్రీనివాస్, మా శెట్టి వెంకన్న గోపారపు సత్యనారాయణ బండారు శేషయ్య శర్విరాల మల్లయ్య బుద్ధ అంజయ్య లను ఎన్నికల అధికారి తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవ నియమాయకం జరిగింది. భవన నిర్మాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ నాగన్న బండారు దయాకర్ బండారు నాగన్న ఓరుగంటి సుభాష్ తల్లాడ నారాయణ అంబరీష కృష్ణమూర్తి తల్లాడ శ్రీను రమేష్ తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.