బొడ్మట్ పల్లి లో ఘనంగా గంగ బోనం

Feb 1, 2025 - 19:09
 0  1
బొడ్మట్ పల్లి లో ఘనంగా గంగ బోనం
బొడ్మట్ పల్లి లో ఘనంగా గంగ బోనం

మెదక్ (టేక్మాల్ ) తెలంగాణ వార్త ప్రతినిధి :- మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరధి బొడ్మట్ పల్లి లో  కురుమ సంఘం ఆధ్వర్యంలో  బీరప్ప స్వామి జాతర మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం గంగభోనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గంగ బోనాన్ని గ్రామంలో నుండి ఊరేగిస్తూ వీర గంధాల వేషాధారణలతో నృత్యాలు చేస్తూ, బతుకమ్మలు ఆడుతూ ఘనంగా ఊరేగించారు. గొలకుర్మలు గ్రామ శివారులోని బావిలో దాచిపెట్టిన బీరప్పస్వామి రాతి ప్రతిమలను బావిలో నుంచి వెలికితీశారు. అనంతరం విగ్రహాలను ఊరేగించి, బీరప్ప స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించి బోనాన్ని సమర్పించారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333