వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ
జోగులాంబ గద్వాల 10 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వాహనదారులు ప్రయాణ సమయంలో ప్రమాదాల నుంచి బయటపడేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాల గద్వాల సీఐ టి.శ్రీను అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి బుధవారం గద్వాల మండలం పూడూరు గ్రామంలో గద్వాల సీఐ టి.శ్రీను, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ఆద్వర్యంలో వాహనదారులకు 100 హెల్మెట్లను పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రయాణ సమయంలో సెల్ ఫోన్ల కంటే ముందుగా హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్లలో ప్రయాణం చేసే సమయంలో విధిగా సీటు బెల్టు ధరించాలని అన్నారు. ప్రమాదాల బారినపడి ప్రాణాలను కోల్పోయి కుటుంబ సభ్యులకు దూరం కావద్దన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.