బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు:ఎస్పీ టి. శ్రీనివాస రావు

Jul 4, 2024 - 19:13
 0  25
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు:ఎస్పీ టి. శ్రీనివాస రావు
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు:ఎస్పీ టి. శ్రీనివాస రావు

జోగులాంబద్వాల 4 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిoచి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యతా మన అందరి పై ఉందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హల్ నందు  ఆపరేషన్ ముస్కాన్ 10వ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తప్పిపోయిన పిల్లలను, స్కూల్స్ డ్రాప్ ఔట్ అయిన వారిని గుర్తించడం మరియు భిక్షాటన, బాలకార్మికులు, మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ మొదలైనవాటిలో నిమగ్నమైన వారిని రక్షించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 పనితీరుపై చర్చించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో బాలకార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టిచాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టిచాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిదిలో  బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, తల్లి తండ్రులు తమ పిల్లలను స్కూల్ కు పంపకుండా పత్తి పొలాలలో పనులు చేయించడం వల్ల వాళ్ల బంగారు భవిష్యత్ ను వారే నియత్రించినట్లు అవుతుందని ఆ విషయన్ని తల్లీ దండ్రులు గమనించాలని కోరారు . బాలికల మిస్సింగ్ కేసులు జరిగితే పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి చేదించడం జరుగుతుందని  ఎస్పీ  పేర్కొన్నారు. జిల్లా లో చిన్నారుల కోసం పని చేసే వివిధ శాఖల అధికారులు కూడా తరచూ పాఠశాలలు, కళాశాలలు సందర్శించి బాల్య వివాహాలు, ఎలో ప్మెంట్, స్కూల్ డ్రాప్ ఔట్ జరగడం వల్ల కలిగే నష్టల గురించి అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్కూల్ డ్రాప్ ఔట్ అయిన చిన్నారుల తల్లీ దండ్రులకు కౌన్సిలింగ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వివిధ శాఖలు  "ఆపరేషన్ ముస్కాన్-10" ద్వారా నిరాశ్రయులైన పిల్లలను మరియు  భిక్షాటనలో చిక్కుకున్న పిల్లలు మరియు బాలకార్మికులను బలవంతంగా రక్షించడం మరియు పునరావాసం కల్పించడం లక్ష్యంగా 1 జూలై 2024 నుండి 31 జూలై 2024 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు.  ఇందుకోసం ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, నలుగురు పోలీసు కానిస్టేబుల్‌లు ఉండేలా (ఒక మహిళా పోలీసు హెడ్ కానిస్టేబుల్‌తో సహా)  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని , చిన్నారుల కోసం పని చేసే వివిధ శాఖల లైన్ డిపార్ట్మెంట్  అధికారులు సమన్వయంతో పని చేసి అనాథ పిల్లలను చేరదియడం తో పాటు వెట్టి చాకిరి నుండీ విముక్తి కల్పించాలని అన్నారు . చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపడం ప్రభుత్వా శాఖల తో పాటు తల్లీ దండ్రులకు, బాధ్యతా గల ప్రతి పౌరుని కి ఉందన్న విషయన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు.
అనంతరం అందుకు సంబంధించిన పోస్టర్స్ ను జిల్లా ఎస్పీ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్ పర్సన్ సహదేవుడు, సభ్యులు జయబారతి , సైలజ, జిల్లా లేబర్ డిపార్ట్మెంట్  అధికారి మహేశ్ కుమార్ , ముష్కాన్ టీమ్ ఇంచార్జి ఎస్సై కేశవ రావు, పోలీస్ సిబ్బంది డి.ఇ.ఓ ఆఫీస్ అధికారి వేంకటేశ్వర రావు, వైద్య శాఖ అధికారి రాజు, ఆర్డీవో ఆఫీస్ ఏ.ఓ విజయ్ కుమార్, డీసీపీఓ నరసింహ,  పలు ఎన్జీవో 
 సంఘాల అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333