బాబోయ్... కుక్కలు
- వీధుల్లోకి వెళ్లాలంటే జంకుతున్న జనం
- ద్విచక్ర వాహన దారుల ఆందోళన
- గుంపులుగా తిరుగుతున్న శునకాలు
- బడి పిల్లల తల్లిదండ్రుల ఆందోళన
నాగారం ఆగస్టు 19. తెలంగాణ వార్త :- మండల పరిధిలోని ఫణిగిరి.నాగారం బంగ్లా. గ్రామాలలో గ్రామ సింహాలు యదేచ్చగా స్వైర విహారం చేస్తున్నాయి. మండల పరిధిలోని ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కుక్కలు పెరిగిపోతున్న వాటి సంతతిని చూసినవారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళలో మహిళలు పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. దాదాపు గొర్రెల మందల అవి గ్రామ సెంటర్లు లో అన్ని ప్రధాన రోడ్లపై కనిపిస్తున్నాయి. సాధారణంగా మనుషులను చూస్తే దూరంగా పారిపోయే పరిస్థితులు పోయి మనుషులపైకి వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో అటు పాదచారులు ఇటు ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం రాత్రి వేళల్లో పిల్లల్ని ఒంటరిగా పంపాలంటే భయంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత గ్రామ అధికారులు మండల అధికారులు స్పందించి కుక్కల విషయంలో చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నారు