ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు?
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పోలీసులు త్వరలోనే నోటీసులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ‘దొంగలవో.. లంగలవో.. ఒకటో, రెండో ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసుండొచ్చు. పోలీసుల పనే గదా అది’ అంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో నోటీసులు జారీ చేసి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.