ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో నాణ్యమైన విద్య కొరకు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి
జోగులాంబ గద్వాల 8జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్..*: మండల కేంద్రంలో ప్రోఫెసర్ జయశంకర్ బడి బాటలో భాగంగా ఉదయం 7:00 గంటలకు ధరూర్ గ్రామం లోని కురవ వీధి, కొత్త గేరు, మరియు సబ్ స్టేషన్ వెనకాల ఉన్న ఇండ్లను, ధరూర్ సిపిఎస్ పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ యోగేందర్, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబెర్ అయిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ఖాజాబి, కాంప్లెక్స్ సిఆర్పి నరసింహులు, సందర్శించి పిల్లలను బడికి పంపాలని తల్లిదండ్రులను ప్రేరేపించడం జరిగింది.నీలాహళ్లి గ్రామం లో నిర్వహించిన బడి బాట లో పాల్గొని ఈ సంవత్సరం నీలాహళ్లి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించడం జరుగుతున్న సందర్బంగా యల్కేజీ , యూకేజీ పిల్లలను మరియు బడి వయస్సు ఉన్న పిల్లలందరి ని చేర్పించాలని తెలియచేయడం జరిగింది.పాఠశాల లోని విద్యార్థులందరికీ ఉచితంగా నోటు పుస్తకాలు మరియు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్ తో పాటు మధ్యాన్న భోజనాన్ని, వారానికి మూడు గుడ్లు మరియు రాగిజావా తో పాటు అల్పాహారం ను కూడా అందిస్తున్నందున పిల్లందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. నాణ్యమైన విద్య కొరకు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని బడిబాట కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రంగారెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.