కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. జోగులాంబగద్వాల్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు,డాక్టర్, మల్లురవి , ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, అలంపూర్ మాజీ శాసనసభ్యులు,డాక్టర్ ,ఎస్ ఎ, సంపత్ కుమార్ ఆధ్వర్యంలో విజయంతమైన ప్రజాపాలన బస్సు యాత్ర. జోగులాంబ దేవి సన్నిధిలో ప్రారంభమైన,బస్సు యాత్ర , అలంపూరు, ఉండవల్లి ,మనపాడు, రాజోలి ,వడ్డేపల్లి ఐజ , మల్దకల్, గట్టు, కేటి దొడ్డి ,ధరూరు గద్వాల,
ఇటిక్యాల , ఎర్రవల్లి మండలాల ప్రజా పాలన బస్సు యాత్రముగింపు కార్యక్రమానికి, ఎర్రవల్లి చౌరస్తాలోని ఆదివారంసాయంత్రం 6 గంటలకు, ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్ ఎస్,ఎ. సంపత్ కుమార్ మాట్లాడుతూ అలంపూర్ తాలూకాలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనివారు మాట్లాడుతూ అందరికీ ప్రజా పాలన ప్రభుత్వo ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేసే విధంగా మీరందరూ కృషి చేయాలని, ప్రజలు ,కార్యకర్తలు తమ దృష్టికి తీసుకువచ్చి పనులు చేయించుకోవాలని ప్రజలను కార్యకర్తలను నాయకులను కోరారు. అదేవిధంగా గ్రామాలలోఏ పార్టీ అనకుండా నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మఇండ్లుఇచ్చే బాధ్యత నాదని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు , మలిశెట్టి,రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషి. కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీనాయకులు,జిల్లా కమిటీ సభ్యులకు ,వివిధ మండల అధ్యక్షులకు , సర్పంచులకు కౌన్సిలర్లకు ధర్మవరం మాజీ సర్పంచ్ మధు నాయుడు కృతజ్ఞతలు తెలుపుచున్నాము.