క్యాన్సర్ మీద అవగాహన గురించి ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్  మరియు హెమటాలజిస్ట్ డాక్టర్ కంచర్ల హరీష్

Mar 21, 2024 - 21:15
 0  94
క్యాన్సర్ మీద అవగాహన గురించి ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్  మరియు హెమటాలజిస్ట్ డాక్టర్ కంచర్ల హరీష్

క్యాన్సర్ మీద అవగాహన గురించి ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్  మరియు హెమటాలజిస్ట్ డాక్టర్ కంచర్ల హరీష్ ,యశోద హాస్పిటల్ మేనేజర్ శ్రీనాథ్  గారు ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ నందు  విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ క్యాన్సర్ వస్తే దాన్ని ఎలా నివారించాలి అని మరియు క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి సదుపాయాలు ,చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయో వారు వివరించారు .క్యాన్సర్ అనేది ఒక నయం కాని జబ్బు అని ,దానిని ఎదుర్కోవటం కష్టమని చాలా మందికి అపోహ ఉన్నదని కానీ ఇప్పుడు ప్రతి దానికి ఆధునికంగా  కీమోథెరపీ తో పాటు టార్గెటెడ్ థెరపీ ,ఇమ్యునోథెరపీ లాంటి నూతన వైద్య విధానాలు కనిపెట్టారని ఎటువంటి  సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం అందుబాటులో ఉన్నదని ప్రముఖ వైద్యులు తెలిపారు. క్యాన్సర్ రాకుండా ఏమి చేయవచ్చు అని కూడా వారు తెలియజేయడం జరిగింది. ముందుగా చిన్నచిన్న టెస్టుల ద్వారా ప్రాథమిక దశలోనే కాన్సర్ గుర్తించవచ్చని వారు తెలియజేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి ప్రజలలో అవగాహన తెప్పించి క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలని అప్రమత్తం చేయాలని ,మమ్మోగ్రఫీ ,పాప్ స్మియర్ టెస్ట్స్ ల ద్వారా 40 సవత్సరములు పైబడిన మహిళలో బ్రేస్ట్ క్యాన్సర్ మరియు సర్విక్స్ కన్వర్ లను తొలి దశలోనే పసిగట్టి పూర్తిగా నయం చేయవచ్చని ఆయన వివరించారు. ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నదని వ్యాక్సిన్ వేయడం వల్ల 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా  చేయవచ్చు అని తెలిపారు. చాలా వరకు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ,మద్యం మరియు ధూమపానం అలవాట్లకి దూరంగా ఉండాలని ,శారీరక వ్యాయమనేది చాలా ముఖ్యమని ఆయన తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333