ప్రపంచం గర్వించదగ్గ  మేధావి అంబేద్కర్

Apr 14, 2026 - 14:27
Apr 14, 2026 - 15:05
 0  12

 తెలంగాణ రాష్ట్ర  రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట, 14 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త వేలేఖరి :- యావత్తు ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్* అన్నారు. మంగళ వారం సూర్యాపేట జిల్లా  కేంద్రంలోని రైతు బజార్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశంలో  కొనసాగుతున్న అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆనాడే పోరాటం నడిపిన ఉద్యమ సూర్యుడు అని గుర్తు చేశారు. అంటరాని వారు పాఠశాల లోకి ప్రవేశం లేని నాడే తరగతి గది బయట కూర్చుని విద్య నేర్చుకొని ప్రపంచ దేశాలలో ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోనే అతి పెద్ద చదువులు చదివిన  అంబేద్కర్ ప్రపంచంలో ఓ గొప్ప మహనీయుడు గా మారారని చెప్పారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితాన్ని ఈ తరం యువత స్ఫూర్తిగా తీసుకొని నిరక్షరాస్యత లేని దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు,  దేవత్ కిషన్నాయక్, జిల్లా గౌరవ సలహాదారుడు, మాదిరెడ్డి  గోపాల్ రెడ్డి, రాష్ట్ర îఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి  వెన్న శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి పాల సైదులు, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శి పర్వతం వెంకటేశ్వర్లు, దస్తగిరి, గోపాల్ రెడ్డి, చక్రు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఖమ్మం పాటి అంజయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి వెంకన్న, బానోతు జానీ నాయకు, అయితే గాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సరగండ్ల కోటే స్,పెగిపురం నర్సయ్య  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333