ప్రపంచ మేధావి అంబేద్కర్   చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెంచాలి 

Dec 6, 2024 - 19:55
Dec 6, 2024 - 20:10
 0  3

 అంబేద్కర్ స్ఫూర్తిని ప్రభుత్వాలు కొనసాగించాలి 

  భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి 

 తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్

  (సూర్యాపేట టౌన్ డిసెంబర్ 6 ) :  ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్  అన్నారు. ఈరోజు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ వద్దా ఈద్గా రోడ్లో అంబేద్కర్  వర్ధంతిని  పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు  వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో  ఎన్నో దేశాలు తిరిగిన అంబేద్కర్ అక్కడ స్థితిగతులను  పరిశీలించి దేశానికి కావలసిన  భారత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. పేదరికంలో పుట్టి వీధి దీపాల వెలుగులో ఉన్నత చదువులు  చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా  ఎదిగారని  గుర్తు చేశారు. ప్రపంచంలోని  అన్ని దేశాలలో  జ్ఞానానికి చిహ్నంగా  అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి  గౌరవిస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మూడు ప్రకారమే   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగిందని అన్నారు. దేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశంలో ప్రస్తుతం చట్టాలు నడుస్తున్నాయని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. చట్టసభల్లో  బీసీల ప్రాతినిధ్యం  పెంచాలని ప్రభుత్వాలను  డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్ఫూర్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని బడుగు బలహీనవర్గాల  అభివృద్ధికి తోడ్పాటు అందించాలని  విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ పూర్తిస్థాయి  చరిత్రను  ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో చేర్చి  భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పెగ్గెపురం నరసయ్య కొనతం నర్సిరెడ్డి సేవాలాల్ అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333