ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఎస్సై వెంకట్ రెడ్డి
తిరుమలగిరి 22 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని వశిష్ట పాఠశాలలో ఈరోజు తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ (SI) మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పోలీసు సిబ్బంది, పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి సుమారు 100 మొక్కలను నాటారు.అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి మొక్కలను నాటాలని, వాటిని వృక్షాలుగా మార్చే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ (CC) కెమెరాల ప్రాధాన్యతను ఆయన వివరించారు. గ్రామాలు, కాలనీలు మరియు విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరస్థులను త్వరగా పట్టుకోవచ్చని మరియు నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.మరోవైపు బాలల రక్షణ మరియు వారి హక్కులపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ మరియు చిన్న పిల్లలపై జరుగుతున్న వేధింపుల నివారణకు చట్టాలు కల్పిస్తున్న llరక్షణను వివరించారు. విద్యార్థులు లేదా బాలికలు ఎవరైనా ఇబ్బందులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి పోలీస్ సిబ్బంది, పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ సునీత అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.