ప్రజావాణి ఫిర్యాదులు మూడు
ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి ఎంపీడీవో .
జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : . ఇటిక్యాల. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమం ఎంపీడీవో రమాదేవి& తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా మూడు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపిడిఓ తెలిపారు. ,
ఇటిక్యాల సర్పంచ్ జీవన్ రెడ్డి,ఇటిక్యాల గ్రామపంచాయతీ పాత భవనం స్థిలావస్థలో ఉన్నందున బిల్డింగ్ ను తీసివేసి ఏదైనా ఒక గవర్నమెంట్ కు సంబంధించిన బిల్డింగు నిర్మించడం కొరకు ఫిర్యాదు చేసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు.
1బుడ్డారెడ్డిపల్లి గ్రామం 2 గోపాల్ దిన్నె గ్రామం వారు
ఇందిరమ్మ ఇల్లు ఎల్ త్రీ లో ఉన్నవి ఎల్ వన్ కి మార్చడానికి ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఇటిక్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది కనుక మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజలను ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఇటిక్యాల తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి, , ఏపీవో అశోక్, ఏవో రవికుమార్,ఐసీడీఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి, ఏపిఎం పద్మ, ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్టికల్చర్ ఆఫీసర్ అరుణ, హెల్త్ సూపర్వైజర్ శేఖర్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, వెటర్నరీ డాక్టర్ భువనేశ్వరి,హౌసింగ్ ఏఈ ప్రియాంక,ఎక్సైజ్ కానిస్టేబుల్ సురేష్, ఉన్నారు.