గ్రామ పట రూపకల్పన కార్యక్రమం
మల్లారెడ్డి వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రతిభ
నర్సాపూర్ 7 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట్ గ్రామంలో మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామ పట రూపకల్పన కార్యక్రమం నిర్వహించారు.వ్యవసాయ ప్రయోగాత్మక పర్యాటనలో భాగంగా విద్యార్థులు గ్రామాన్ని శేత్రస్తాయిలో పరిశీలించి సమగ్ర సమాచారాన్ని పట రూపంలో అందించారు. గ్రామంలోని వివిధ రకాల మట్టి వివరాలను సేకరించి వాటి శాతాలను పై చార్ట్ ద్వారా ప్రదర్శించారు.ఏ రకమైన నేలలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో పంటల ఎంపిక సాగు ప్రణాళికలకు రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ సమాచారం పై రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ..విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మమత,సెక్రటరీ సంతోష్, వార్డు మెంబర్లు,గ్రామ పెద్దలు విద్యార్థులకు సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత సెక్రటరీ సంతోష్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు అలాగే కెవికే ఇంచార్జ్ ఉదయ్ కుమార్ మరియు మల్లారెడ్డి వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.