గుంతలతో గట్టు రహదారి దారుణం… ప్రయాణికులకు నరకయాతన
ప్రధాన రహదారి పాడైపోయింది… అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.
జోగులాంబ గద్వాల 14 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గట్టు మాచర్ల గ్రామం నుంచి గట్టు మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. పలు గ్రామాల నుంచి రోజూ వందల వాహనాలు ఈ దారిలో ప్రయాణిస్తుండగా.. గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై స్పందించిన మాచర్ల 7వ వార్డు సభ్యుడు భీమేష్ నాయుడు, వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రమాదాలను నివారించేందుకు మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.