ప్రజలకు త్వరిత న్యాయం అందించడమే లక్ష్యం : జిల్లా ఎస్పి నరసింహ

జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 3890 కేసుల పరిష్కారం

Mar 29, 2026 - 23:19
 0  3
ప్రజలకు త్వరిత న్యాయం అందించడమే లక్ష్యం : జిల్లా ఎస్పి నరసింహ

ఈ నెల 28-03-2026 న జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీస్ శాఖ, న్యాయ విభాగం మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో విశేష ఫలితాలు సాధించబడినవి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించబడిందిని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మొత్తం 3890 కేసులు పరిష్కరించబడినవి. ఇందులో MV యాక్ట్, DD కేసులు : 1845, E-Petty కేసులు 1463, IPC కేసులు 498, SLL కేసులు 84 పరిష్కరించబడింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో, చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారా ప్రజల సమయం మరియు ఖర్చు కూడా ఆదా అవుతుందని అన్నారు.

అదేవిధంగా, ప్రజలు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందగలరని, భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాలు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యమైందని జిల్లా ఎస్పీ అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333