ప్రమాదం జరగకముందే విద్యుత్ బాక్స్‌కు మూత ఏర్పాటు చేయాలి*లేక కొత్త విద్యుత్ బాక్స్ బిగించాలి
జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పట్టణంలోని ధరూర్ మెట్టు–రాయచూర్ రోడ్డులో 10వ వార్డు పరిధిలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి వీధి దీపాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ బాక్స్‌కు మూత లేకుండా ఉంది. ఈ మార్గంలో చిన్నారులు, విద్యార్థులు, బాటసారులు, స్థానిక ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో బాక్స్‌లోకి నీరు చేరితే విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని స్థానికులు కోరుతున్నారు. 10వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు స్పందించి క్రొత్త విద్యుత్ బాక్స్‌కు మూత ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.