నూతన కమిటీని ఆశీర్వదించిన ఎమ్మెల్యే మందుల సామెల్
వెలిశాల మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడిగా మొగిలి రవీందర్ ఏకగ్రీవం.
శాలువాలతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే
తిరుమలగిరి 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధి వెలిశాల గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా మొగిలి రవీందర్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సభ్యులందరి ఏకాభిప్రాయంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ముదిరాజ్ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో, నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మొగిలి రవీందర్ ముదిరాజ్ తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామెల్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ నూతన అధ్యక్షుడు రవీందర్ ముదిరాజ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెలిశాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి కావలసిన పూర్తి సాయ సహకారాలను అందిస్తానని, ముదిరాజ్ సంఘం పురోగతికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీ పట్ల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు సోడ భిక్షం, కార్యదర్శి మొగిలి రమేష్, డైరెక్టర్లు రాజశేఖర్, సాయికిరణ్, యాకన్న, సైదులు, సత్తయ్య, ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేణు రావు, నాయకులు జాటోతు లకుపతి, బాలాజీ, వీరారెడ్డి, సోమన్న, వగలరాని రమేష్, రాములు నాయక్, యాకన్న, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.