మృతుని కుటుంబానికి పవన్ సాయి హాస్పిటల్ ఎండీ శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం
అడ్డగూడూరు 26 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన పొన్నాల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఆవిషయం తెలుసుకున్న పవన్ సాయి హాస్పిటల్ అధినేత డా"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా వెంకన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన డా"శ్రీనివాస్ గౌడ్,మృతుడి కుటుంబానికి రూ.10,వేల ఆర్థిక సహాయం అందజేశారు.భవిష్యత్తులో కూడా కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచిన డా"ఆలేటి శ్రీనివాస్ గౌడ్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.