సౌత్ కొరియన్ మ్యూజిక్ విన్నాడని పబ్లిక్‌లో ఉరి?
దేశంలో నిషేధిత సౌత్ కొరియన్ సాంగ్స్ విన్నాడని 22 ఏళ్ల యువకుడిని నార్త్ కొరియా ప్రభుత్వం పబ్లిక్‌లో ఊరి తీసిందట. దేశం విడిచి వెళ్లిన 649 మంది సాక్ష్యాలతో నార్త్ కొరియా మానవ హక్కుల సంఘం ఓ నివేదిక విడుదల చేసింది. 60 సౌత్ కొరియన్ సాంగ్స్ వినటంతో పాటు 3 సినిమాలు చూశాడని హ్వాంగ్హే ప్రావిన్స్‌లోని వ్యక్తిని 2022లో పబ్లిక్‌గా ఉరి తీసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అయితే ఉరి వార్తలను నార్త్ కొరియా కొట్టిపారేసింది.