నవంబర్ 26న సూర్యాపేట జిల్లాలో నిర్వహించే టి. ఎమ్మార్పీ.ఎస్. విజయోత్సవ మహాసభను విజయవంతం

Oct 19, 2024 - 20:19
 0  1
నవంబర్ 26న సూర్యాపేట జిల్లాలో నిర్వహించే టి. ఎమ్మార్పీ.ఎస్. విజయోత్సవ మహాసభను విజయవంతం

చేయండి.టి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ పిలుపు  మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోళ్ల బాలరాజు మాదిగ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పరిపాలన విధానం మనకు అందరికీ తెలిసిన విషయమే అలాంటి విషయాలను కొనసాగకుండా  ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగలకు మాదిగ జాతి బిడ్డలకు సానుకూలంగా ఉంటుందని మేము ఏకీభవిస్తున్నాము 1994 నుండి 2024 వరకు 30 సంవత్సరాలు టి ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులుగా పోరాటం చేస్తున్నటువంటి మాదిగ జాతి బిడ్డలను ఆదుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2009వ సంవత్సరంలో నిరుపేద విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో  విద్యా హక్కు చట్టమును అమలు  చేయటం జరిగిందని అలాగే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని,  మాదిగలకు అంబేద్కర్ అభయస్థం కింద దళితునికి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్మికులుగా కొనసాగుతున్న దళితులందరికీ సమానమైన వేతనాలు అందించి వారినందర్నీ ఆదుకోవాలని  ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులను గుర్తించి వారి కుటుంబాలకు 150 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకొని వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఇటుక రాజు మాదిగ కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి బాలరాజు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషాపంగు సత్యం మాదిగ, రాష్ట్ర గౌరవ సలహాదారి కొండగడుపుల సూరయ్య మాదిగ,రాష్ట్ర నాయకులు కొత్తపెళ్లి వెంకన్న మాదిగ, ఒగ్గు వెంకన్న మాదిగ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ, సురాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్ మాదిగ, జిల్లా నాయకులు ములకలపల్లి కాటయ్య మాదిగ,కొండ రవి మాదిగ,మామిడి సైదులు మాదిగ, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పెడమర్తి కమల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333