కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పండగ ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు
కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పండుగ:ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్రంలో అయిదేళ్ల తర్వాత అభివృద్ధి పండుగ మొదలైందని,ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు జగ్గయ్యపేట నియోజకవర్గం,పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలోని 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుచున్న సీసీ రోడ్డు,మరియు డ్రైనేజీ నిర్మాణం పనులకు శనివారం నాడు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో,గ్రామ సర్పంచ్,మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు భూమి పూజ కార్యక్రమం చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు.గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తే,కూటమి ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేస్తూ,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేయడం చాలా సంతోషమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.