దేశాభివృద్ధిలో బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమూల్యం..
ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 117వ జయంతి వేడుకలు
విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన 23వ వార్డ్ కౌన్సిలర్ వల్దాస్ సౌమ్య జానీ..
దేశ అభివృద్ధిలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు అమూల్యమైనవని 23 వ వార్డ్ కౌన్సిలర్ వల్దాస్ సౌమ్య జానీ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా శుక్రవారం కొత్త బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని దళిత బహుజనల అభివృద్ధి కోసం బాబు జగ్జీవన్ రామ్ విశేషంగా కృషి చేశారని అన్నారు.ఆయన హయాంలో చేపట్టిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నాటి ప్రజల జీవన స్థితిగతులను మార్చాయన్నారు. స్వాతంత్ర సమరయోధులుగా, మాజీ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావ్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను సాధించే లక్ష్యంతో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట గ్యార విజయ్,ఎల్గురి గోవిందు, మామిడి సుందరయ్య, పిడమర్తి సునీత తదితరులు ఉన్నారు.