తెలంగాణ మాదిగ ఉపకులాల జర్నలిస్టుల ఫోరం మండల అధ్యక్షులుగా
పనుమటి సైదులు ఉప అధ్యక్షులుగా కడెం రవివర్మ
అడ్డగూడూరు16 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజున తెలంగాణ మాదిగ ఉప కులాల జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి కడియం నాగయ్య అధ్యక్షతన శుక్రవారం రోజు అడ్డగూడూరు మండల కమిటీ అధ్యక్షులుగా పనుమటి సైదులును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతన అధ్యక్షుడు పనుమటి సైదులు మాట్లాడుతూ..తన ఎన్నికకు సహాకరించిన మాదిగ జర్నలిస్టు ఉపకులాల వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ.. రానున్న రోజుల్లో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం అభివృద్ధికై తన వంతు సహాయ శక్తుల వరకు మన సంఘానికి కృషి చేస్తానని అన్నారు.ఉపాధ్యక్షులుగా కడియం రవివర్మ,ప్రధాన కార్యదర్శిగా బాలెంల పరుశురాములు, కోశాధికారిగా బాలెంల కళ్యాణి దుర్గయ్య,కార్యదర్శిగా మందుల నర్సింహ,ప్రచార కార్యదర్శిగా నిర్మాల వెంకటేష్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.కార్యవర్గ సభ్యులుగా గూడెపు పరమేష్, కడియం సంజీవ,బాలెంలా విద్యాసాగర్ గూడెపు నాగరాజు,నిర్మాల సందీప్,చింతసుధాకర్,తదితరులు పాల్గొన్నారు.