తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గిలకత్తుల రమేష్ గౌడ్
తిరుమలగిరి 18 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- మలి దశ ఉద్యమం నుండి తన అట పాటలతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన గాయకుడు ఎంతో మంది కళాకారులతో కలిసి ప్రతి జిల్లా రాష్ట్రం లో నలుమూలల తన అట పాటతో రాష్ట్రం కోసం పోరాడి వచ్చిన రాష్ట్రం లో రావలిసిన హక్కుల కోసం పోరాడుతున్న కవి గాయకుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కి చెందిన గిలకత్తుల రమేష్ కి హైదరాబాద్ కళాభారతి లో ఆత్మీయ సమావేశం లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నుకోవడం జరిగింది కావున గిలకత్తుల రమేష్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన సంఘం చైర్మన్ అనువోజు వెంకటేశం అధ్యక్షులు దరువు అంజన్న వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేసారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు వచ్చే వరకు సంఘం పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు కచ్చితంగా పని చేస్తాను అని అన్నారు. కార్యక్రమం లో రాష్ట్ర కమిటీ నాయకులు పేరాల యాదగిరి, జువ్వాజీ ప్రవీణ్, గజ్వేల్ ప్రతాప్, పందిరి సైదులు, కొండ్ర కుమార్, సలీమ్. రాకేష్, శారద, పరకాల రమ, మట్టెడ కవిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు