తిరుమలగిరిలో బిజెపి నాయకులు అరెస్ట్

Mar 23, 2026 - 08:21
Mar 23, 2026 - 08:22
 0  310
తిరుమలగిరిలో బిజెపి నాయకులు అరెస్ట్

తిరుమలగిరి 23 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్ రామచంద్ర రావు  పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. అక్రమ అరెస్టు చేసి బిజెపి పోరాటాలను అణిచివేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే నిరసనలు ఆందోళనలు చేసే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. కానీ ప్రతిపక్షాలను ప్రశ్నించకుండా అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంది. జిల్లా ఉపాధ్యక్షులు మేడబోయిన యాదగిరి, మండల అధ్యక్షులు వేల్పుల బంగారు, యువమోర్చ నాయకులు వేల్పుల శ్రీనివాస్, హరీష్, బొల్లంపల్లి వార్డు సభ్యులు చవ్వా సురేష్  అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి