రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి.

Mar 22, 2026 - 22:41
 0  0
రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి

 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి.

 తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

 (సూర్యాపేట, మార్చి 22)

 రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్స్ లో జరిగిన అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఎంతోమంది నిరుద్యోగులు కుటుంబ పోషణకు కష్టంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి అన్ని జిల్లాల్లో నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనాలు నిర్మించి కార్యాలయం పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల సౌకర్యం తో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 5 ఎకరాల లోపు వెంచర్లు చేసిన ప్రాంతాలలో ఫ్లాట్ నెంబర్లతోనే రిజిస్ట్రేషన్ చేసేలా ప్రత్యేక జీవో తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన రాష్ట్రఅధ్యక్షునిగా ఎన్నికైన పంతంగి వీరస్వామి గౌడ్ ను తెలంగాణ వ్యాప్తంగా గల 33 జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

 రాష్ట్ర కమిటీ ఎన్నిక 

 రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్,

 రాష్ట్ర గౌరవ సలహాదారులుగా 

 కుమ్మరి కుంట్ల లింగయ్య, పందిరి మల్లేష్,

 రాష్ట్ర అధ్యక్షులుగా పంతంగి వీరస్వామి గౌడ్,

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాదగాని శ్రీనివాస్ గౌడ్,

 రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్,

 రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నల్ల మాస చంద్రశేఖర్, బండి నాగేశ్వరరావు,బెల్లంకొండ యాదగిరి, రాష్ట్ర కార్యదర్శులుగా ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పర్వతం వెంకటేశ్వర చారి, అమరవాది శ్రావణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శిలుగా సామల జగ్గారెడ్డి, ఏట సతీష్, మొక్క రాము లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా కొంపెల్లి దశరథ సమన్వయం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333