తిరుమలగిరిలో బిఆర్ఎస్ పార్టీ రాస్తారోకో
తిరుమలగిరి 17 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం తెలంగాణ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టును నిరసిస్తూ తిరుమలగిరి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక తిరుమలగిరి చౌరస్తా వద్దకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి రాస్తారోకో చేపట్టారు. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులను నిరసిస్తూ బిజెపి ప్రభుత్వం మరియు రాష్ట్ర లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందం వల్ల బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అక్రమ అరెస్టుగా నిరసిస్తూ రాస్తాగో నిర్వహిస్తున్నామని తెలిపారు అదే విధంగా కోట్లు కేసు ఉన్న ఎలాంటి వారంటీస్ ఇవ్వకుండా అక్రమంగా కొంతమందిని పంపించి హౌస్ అరెస్ట్ చేసి వారి పైన లేనిపోని సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసి అరెస్టు చేస్తున్నామని తెలిపారు ఇలాంటి అరెస్టులకు భయపడే లేదని 14 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన కుటుంబీకులను ఈరోజు వారిపై అభండాలు వేసి జైలుకు పంపడం సరైన పద్ధతి కాదు అని రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, ఎంపీపీ స్నేహలత, మాజీ మార్కెట్ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్, జడ్పిటిసి దుప్పటి అంజలి రవీందర్, కౌన్సిలర్ శ్రీలత, బిఆర్ఎస్ నాయకులు కారు పోతుల నరేష్, పోతురాజు మల్లేష్, కృష్ణ, సురేందర్ తదితరులు ,వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు