ఉపాధి పనుల్లో ప్రమాదం: పాముకాటుకు గురైన కూలీ
అప్రమత్తంగా వ్యవహరించి ఆసుపత్రికి తరలించిన క్షేత్ర సహాయకుడు (ఫీల్డ్ అసిస్టెంట్).
* ఉపాధి హామీ కూలీలు పనుల ప్రదేశంలో జాగ్రత్తలు వహించాలని సూచనలు.
జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ.ఉపాధి పనుల్లో ప్రమాదం: పాముకాటుకు గురైన కూలీ ఐజ మండల పరిధిలోని పులికల్ గ్రామంలో గురువారంఉపాధి హామీ పనుల ప్రదేశంలో ఒక కూలీ పాముకాటుకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిన్న హనుమంతు అనే కూలీ ప్రతిరోజూ లాగే ఉపాధి హామీ పనుల్లో భాగంగా తన పని తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పొదల్లో దాగి ఉన్న పాము ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి కరిచింది. గమనించిన తోటి కూలీలు వెంటనే కేకలు వేయడంతో, అక్కడ విధుల్లో ఉన్న క్షేత్ర టెక్నికల్ అసిస్టెంట్లు అశోక్ సహాయకుడు (ఫీల్డ్ అసిస్టెంట్) ఉదయ్ కుమార్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించి, వైద్యులతో అత్యవసర చికిత్స చేయించారు. ప్రస్తుతం సకాలంలో వైద్యం అందడంతో కూలీ హనుమంతు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా క్షేత్ర .సహాయకుడు ఉదయ్ కుమార్ ఉపాధి హామీ కూలీలకు పలు కీలక సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పాములు, తేళ్లు వంటి విషకీటకాలు పొదలు, రాళ్ల గుట్టల మధ్య ఆశ్రయం పొందుతాయని, కాబట్టి కూలీలు పనుల ప్రదేశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా చెత్తాచెదారం, పొదలుగా ఉన్నచోట పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం లేదా కర్రలతో ఆ ప్రదేశాన్ని ముందుగా పరిశీలించుకోవడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఇలాంటి అనర్థాలు జరిగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పొరపాటున ఎవరికైనా పాముకాటు వేస్తే నాటు వైద్యం వైపు వెళ్లకుండా, వెంటనే ప్రభుత్వ దవాఖానాకు చేరుకోవాలని, అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పాముకాటుకు విరుగుడు మందులు అందుబాటులో ఉంటాయని కూలీలకు వివరించారు. పరిధిలోని పులికల్ గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనుల ప్రదేశంలో ఒక కూలీ పాముకాటుకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిన్న హనుమంతు అనే కూలీ ప్రతిరోజూ లాగే ఉపాధి హామీ పనుల్లో భాగంగా తన పని తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పొదల్లో దాగి ఉన్న పాము ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి కరిచింది. గమనించిన తోటి కూలీలు వెంటనే కేకలు వేయడంతో, అక్కడ విధుల్లో ఉన్న క్షేత్ర టెక్నికల్ అసిస్టెంట్లు అశోక్ సహాయకుడు (ఫీల్డ్ అసిస్టెంట్) ఉదయ్ కుమార్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించి, వైద్యులతో అత్యవసర చికిత్స చేయించారు. ప్రస్తుతం సకాలంలో వైద్యం అందడంతో కూలీ హనుమంతు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా క్షేత్ర .సహాయకుడు ఉదయ్ కుమార్ ఉపాధి హామీ కూలీలకు పలు కీలక సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పాములు, తేళ్లు వంటి విషకీటకాలు పొదలు, రాళ్ల గుట్టల మధ్య ఆశ్రయం పొందుతాయని, కాబట్టి కూలీలు పనుల ప్రదేశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా చెత్తాచెదారం, పొదలుగా ఉన్నచోట పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం లేదా కర్రలతో ఆ ప్రదేశాన్ని ముందుగా పరిశీలించుకోవడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఇలాంటి అనర్థాలు జరిగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పొరపాటున ఎవరికైనా పాముకాటు వేస్తే నాటు వైద్యం వైపు వెళ్లకుండా, వెంటనే ప్రభుత్వ దవాఖానాకు చేరుకోవాలని, అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పాముకాటుకు విరుగుడు మందులు అందుబాటులో ఉంటాయని కూలీలకు వివరించారు.