డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి 

Jul 15, 2026 - 19:34
 0  1
డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి 

అద్దెలు రూ.55 వేలకు పెంచాలి

సూర్యాపేట: డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, అద్దె వాహనాల నెలవారీ అద్దె ను రూ.55 వేలకు పెంచాలని తెలంగాణ అద్దె వాహనాల యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ పవన్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అద్దె వాహనాల యజమానులు, డ్రైవర్లతో కలిసి  నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2017లో అప్పటి ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నెలవారీ అద్దె ను రూ.33 వేలకు నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం ఇంధన ధరలు, విడిభాగాల ధరలు, నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అద్దెను రూ.55 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 15 నుంచి 18 నెలలుగా అద్దె వాహనాల బిల్లులు పెండింగ్‌ లో ఉండటంతో వాహన యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బిల్లులు అందక బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని, వాహనాలకు ఇంధనం కూడా పోయించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతి కలెక్టరేట్‌ లో డ్రైవర్ల కోసం ప్రత్యేక విశ్రాంతి గది (రెస్ట్‌రూమ్), వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఎండ, వానల కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయని, డ్రైవర్లు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైవర్లకు ప్రత్యేక గది కేటాయించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకన్న, ఉపాధ్యక్షులు తన్నీరు మహేష్, యూనియన్ సభ్యులు రహీం, సాయికుమార్, హరీష్, హుస్సేన్ నాయక్, సందీప్, జీవన్, కృష్ణ, సుమన్ నాయక్, సంతోష్, షరీఫ్,శ్రీకాంత్, సిద్ధార్థ్, మధు, హరీష్, నగేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333