సూర్యాపేటకు రైల్వేను సాధించే వరకు పోరాటం కొనసాగాలి: డాక్టర్ రామ్మూర్తి యాదవ్
సూర్యాపేట ఎంతో కీలకమైన నగరం అయినప్పటికిని రైల్వే లైన్ లేకపోవడం ఎంతో విచారకరమని రైల్వే సాధించేందుకు తప్పనిసరిగా నిరంతర పోరాటం అవసరమని ప్రముఖ వైద్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ కౌన్సిలర్,,డాక్టర్ రామ్మూర్తి యాదవ్ అన్నారు.
సూర్యాపేటలో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట చుట్టూ అనేక రైల్వే లైన్ ఉన్నాయని అటు ఖమ్మం నుండి కానీ నల్లగొండ నుండి గాని మిర్యాలగూడ నుండి గాని చిట్యాల నుండి గాని లేదా జనగామ నుండి గాని రైల్వే లైన్ తీయాలని ఎంతో కాలంగా సూర్యాపేట ప్రజలు అడుగుతూ వచ్చారని కానీ ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే ఉద్యమాల అవసరాలు ఏర్పడతాయని ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ కార్యాలయం ద్వారా ప్రజలను చైతన్యపరిచి బలమైన ఉద్యమాలు నిర్మించి సూర్యాపేట రైల్వే సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పక్షాల నాయకులు రాజకీయాలకు అతీతంగా సూర్యాపేటకు రైలు సాధించేందుకు సహకరించాలని కోరారు. సూర్యాపేట రైలు సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సూర్యాపేట ప్రాధాన్యతను వివరించి రైల్వే లైన్ కోసం అడగాలని ఆయన కోరారు. ఈ సభకు అధ్యక్షత వహించిన రైల్వే సాధన సమితి అధ్యక్షులు డేగల జనార్దన్ మాట్లాడుతూ రైల్వే సాధన కోసం రాజకీయ పార్టీల సంఘీభావం కోరుతూ మొత్తం పౌర సమాజాన్ని మేల్కొల్పాలని తాము భావిస్తున్నట్టుగా ప్రకటించారు. రైల్వే ఉద్యమాలను రాజకీయాలకతీతంగా నిర్వహిస్తూ రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతూనే పౌర సమాజం ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. రైలు కోసం జరుగుతున్న పోరాటంలో పెత్తనం కోసం పాకులాడ టం మంచిది కాదని ఐక్య ఉద్యమాలకు సహకరించాలని ప్రజలను సమీకరించే పెద్ద పనిలో అందరం కార్యకర్తల మేనని ఆయన అన్నారు ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ ప్రజా వైద్యులు రైల్వే సాధన సమితి గౌరవాధ్యక్షులు డాక్టర్ కే రంగారెడ్డి, రైల్వే సాధన సమితి సలహాదారులు లింగంపల్లి భద్రయ్య, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చింతలపాటి చిన్న శ్రీరాములు, నీలా శ్రీనివాస్, ఎల్ఐసి జిల్లా నాయకులు గడ్డం వెంకన్న, సిపిఐ ఎంఎల్ నాయకులు కారింగుల వెంకన్న, వెంకట్ యాదవ్, టిఆర్పి జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, రైల్వే సాధన కోసం కృషి చేసిన ఆమనగంటి సైదులు మాట్లాడారు.
బుద్ధ సత్యనారాయణ, ఎర్ర అఖిల్, మన్నెం యాదగిరి, నల్లపాటి అప్పారావు బయ్యా మల్లికార్జున్, కోడి వెంకటయ్య, పోతురాజు నరసయ్య మధుసూదన్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు