జానకీ రామం

జగదభి రామం జానకీ రామం
జయ జయ రామం రాఘవ రామం
దశరథ రామం భార్గవ రామం
జయ జయ రామం సీతా రామం
పలికిన నీ నామం పరవశించే నా ప్రాణం
తలచిన నీ నామం తరియించే నా జన్మం
ఇనకుల వంశా రఘు రామా...
రఘుకుల తిలకా జయ రామా....
జానకీ మానస చోరా ఓ రామా...
జనులు మెచ్చిన కోసల రామా...
జగదభి రామం జానకీ రామం
జయ జయ రామం రాఘవ రామం......
తండి మాట జవ దాటక అడవుల కేగితివి
పిన తల్లి కోరికనూ మన్నించీ...
రాజ్యం సౌఖ్యం వదిలితివి
నార వస్త్రం ధరియించి మునిలా ముందుకు సాగితివి
ప్రజలందరి మన్నన పొందితివి.
భరతుని కోరిక తీర్చుటకై
నీ పాదుకలే రాజ్యము నేలే....
నిన్ను కొలచిన ఓ రామా
భయము తొలుగు భార్గవ రామా
నిన్ను వేడిన ఓ రామా
నిత్య విజయమే జయ రామా
ఆడి తప్పని అయోధ్య రామా
మడమ తిప్పని దశరథ రామా
ఇనకుల వంశా రఘురామా.........
రఘుకుల తిలకా జయ రామా....
హనుమ భక్తి లోనింగిని దాటె
శబరి ప్రేమలో హద్దులు చేరిపే
గుహుడి మైత్రి లో ధరిత్రే మురిసే
ఉడుత సేవతో చరితే రాసే....
అహల్య వేచెను అహో రాత్రులు
రామచంద్ర నీ పాదస్పర్శ కై....
ఇనకుల వంశా రఘు రామా...
రఘుకుల తిలకా జయ రామా....
ఒకే మాట అది రామ మాట
ఓకే బాట అది రామ బాట
ఒకే బాణమది రామ బాణం
ఒకే సతి అదే సీతా సఖి....
ఉత్తమ విలువల ఉన్నతి కొరకు జీవితమంతా ధారపోసి
మానవ జన్మ కు
విలువలు నేర్పగ
ధరణి లో వెలిసే ధాశరథీ
ఇనకుల వంశా రఘురామా.........
రఘుకుల తిలకా జయ రామా....
జానకీ మానస చోరా ఓ రామా...
జనులు మెచ్చిన కోసల రామా...
జగదభి రామం జానకీ రామం
జయ జయ రామం రాఘవ రామం......