ఇసుక రీచ్ లో గిరిజన సొసైటీలకు అన్యాయం

*ఇసుక రీచ్ లో గిరిజన సొసైటీలకు అన్యాయం*
వాజేడు (తెలంగాణ వార్త ): వాజేడు మండల కేంద్రంలో గిరిజన ఇసుక సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యుల టింగా బుచ్చయ్య ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో టింగా బుచ్చయ్య మాట్లాడుతూ... గోదావరి తీర ప్రాంతమైన వాజేడు మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీలలో గిరిజనుల అభివృద్ధి కోసమని ఇసుక సొసైటీల పెట్టీ క్యూబిక్ మీటర్ కు రూ;650 , అదేవిధంగా ప్రభుత్వానికి రూ:200 మరియు సొసైటీలకు రూ 450 చొప్పున నిర్ణయించి క్వారిలకు అనుమతులు ఇప్పించి నడిపించారు. తర్వాత ప్రభుత్వంలో చెల్లింపులు లేకపోవడమే కాకుండా ఇంకా ధరలు తక్కువ చేసి ఇప్పిస్తున్నారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా ములుగు జిల్లాలో కార్మిక ప్రమాణాల అమలు విభాగం (డి ఎల్ ఎస్ ఈ) నీ ఏర్పాటు చేయడం లేదు .అదేవిధంగా మండలంలోని కొన్ని పర్యావరణ సున్నిత ప్రాంతాలలో జంతు, వృక్ష భౌగోళిక విలువలు కాపాడటం కోసం అటవీశాఖ అధికారులు అభ్యంతరం తెల్పుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారు.ప్రభుత్వానికి గిరిజనులను,గిరిజన సొసైటిలను అభివృద్ది చెసే ఉద్దేశం ఉంటే ఇకో సెన్సిటివ్ జోన్ ను వెంటనే తొలగించి ఇసుక క్వారీలకు డి ఎల్ ఎస్ ఈ నిర్వహించి క్యూబిక్ మీటర్ కు సొసైటీలకు రూ:450 చెల్లించాలని అదేవిధంగా గతంలో నిర్వహించిన క్వారీలకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా సొసైటీలకు రెట్లు మరియు సొసైటీ పాలసీలు ప్రభుత్వ నిర్ణయాలు ఆదివాసీలకు మేలు జరిగే విధంగా ఉండాలని లేని పక్షంలో ప్రభుత్వానికీ ఆదివాసులు తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇసుక సోసైటీల అధ్యక్షుడు టింగా బుచ్చయ్య, కార్యదర్షులు సొసైటీ సభ్యులు చింత పూర్ణ చందరావు, పీర్ల సాంబశివరావు, పెద్ది జగపతి రావు, లోడిగా నరసింహ రావు, పెద్ది తాతారావు తదితరుల పాల్గోన్నారు.