జీతం తీసుకోకుండా పనిచేస్తా సర్పంచ్

Apr 17, 2026 - 06:29
 0  78
జీతం తీసుకోకుండా పనిచేస్తా సర్పంచ్

తిరుమలగిరి 17 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  గౌరవ వేతనం(జీతం) తీసుకోకుండా పని చేస్తా -సర్పంచ్ కొమ్ము సోమన్న....

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తిరుమలగిరి ఎంపీడీవో ఆఫీసులో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల సర్పంచులకు అధికారులకు మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగినందున  గుండేపురి సర్పంచ్ కొమ్ము సోమన్న  తెలంగాణ ప్రభుత్వం సర్పంచులకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని తీసుకోకుండా స్వచ్ఛందంగా గుండెపురి ప్రజలకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా పనిచేస్తానని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య  కు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ గుండెపురి గ్రామ ప్రజలందరూ కలిసి గౌరవ ప్రదమైన సర్పంచ్ గా ఎన్నుకొని గౌరవం ఇచ్చారు కాబట్టి ఇంతకంటే పెద్ద గౌరవం లేదని భావించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవేతనాన్ని(జీతం )తీసుకోకుండా పనిచేస్తానని తెలియజేయడం జరిగింది. అందుకుగాను డిపిఓ  సర్పంచ్  ని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్ బాబు ,డిపిఓ యాదయ్య  , ఎమ్మార్వో హరిప్రసాద్ సార్ ,ఎంపీడీవో లాజరు  గారు,ఎస్సై వెంకట్ రెడ్డి , ఎంఈఓ శాంతియ్య  , గుండెపురి పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి మేడం  ఇతర అధికారులు మండల సర్పంచులు,మండల పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి