నో హెల్మెట్ నో ఎంట్రీ

Apr 17, 2026 - 06:32
 0  48
నో హెల్మెట్ నో ఎంట్రీ

  తిరుమలగిరి 17 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ బి లాజర్  అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది . నియోజక స్థాయి ప్రత్యేక అధికారి సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య , మండల ప్రత్యేక అధికారి తుంగతుర్తి వ్యవసాయ డైరెక్టర్ ఎల్ రమేష్ , తిరుమలగిరి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్  ఎల్సోజు చామంతి నరేష్ , తిరుమలగిరి తహసీల్దార్ బాశెట్టి హరిప్రసాద్,తిరుమలగిరి SI జి వెంకట్ రెడ్డి  అతిధులుగా పాల్గొన్న రు మరియు తాసిల్దారు  నో హెల్మెట్ నో ఎంట్రీ తీర్మానాన్ని సభా వేదికగా ప్రవేశపెట్టారు.కార్యక్రమంలో మండల స్థాయి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ నివేదికలను సమావేశంలో ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో తాటిపాముల సర్పంచ్ B. కిషన్ ఇందిరమ్మ ఇళ్లు, కరెంటు సమస్యలు, త్రాగునీరు గురించి, గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ కోసం జరుగుతున్న ప్రచారాలను నివారించాలని , గుండెపురి సర్పంచ్ కొమ్ము సోమన్న కరెంట్ సమస్యలు గురించి, కోక్య నాయక్ తండ సర్పంచ్ ప్రేమకుమార్, చింతలకుంట తండ సర్పంచ్ సి సి రోడ్స్ మరియు ఇందిరమ్మ ఇండ్ల పై వారి సమస్యను సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శాంతయ్య , వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రావు, ఆరోగ్య అధికారి వందన మేడమ్, హౌసింగ్ AE మౌనిక, మిషన్ భగీరథ DE జూన్ ఫ్రైడ్,AE మహేష్  ఎలక్ట్రిసిటీ ఏఈ గిరిబాబు ఏపీఎం లక్ష్మి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు,వార్డు మెంబెర్స్ , పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి