జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసిన మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్
కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు.
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల . జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ తో పాటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా గద్వాల పట్టణంలోనీ పేద ప్రజలకు గతంలో డిప్ లక్కీ డిప్ ద్వారా కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వారికి కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు.అదేవిధంగా గద్వాల పట్టణంలోని పలు పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కేశవ్ కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు గద్వాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.