జాతీయ రహదారిపై నిలిచిన నీటిని తొలగించిన అధికారులు
తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట-జనగామ మరియు వలిగొండ తొర్రూరు ప్రధాన రహదారులపై స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో వున్న పెద్ద మోరి నీటి ప్రవాహం ఎక్కువై రోడ్డుపై ప్రవహించడంతో నీటిని రోడ్డుపై మొత్తం నిలువగా ఎస్సై సురేష్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు చేరుకొని జెసిబి సహాయంతో ఎర్రగుంట చెరువులోకి నీరు వెళ్లేలా సహాయక చర్యలు చేపట్టారు.నిలిచిపోయిన వాహనాల ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు. ఇంచార్జి తహసిల్దార్ జాన్ మహ్మద్,ఇంచార్జి కమిషనర్ బుచ్చిబాబు,వార్డు అధికారులు పాల్గొన్నారు. పెడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి ఎవరు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.ఏదైనా వార్డులలో నీటి నిల్వలు పేరుకుపోయినట్లయితే 9963736687,9885276690 మున్సిపల్ కార్యాలయానికి తక్షణ సహాయానికి ఫోన్ చేయాలని తెలిపారు. సహా చర్యలకు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని కోరారు.