జాతీయ బాలికల దినోత్సవాన్ని" పురస్కరించుకొని శాంతినికేతన్ పాఠశాలలో ,"నూరు వరాలు" మొక్కను నాటిన  దైద సింధు థెరీసా 

Jan 24, 2025 - 21:15
Jan 24, 2025 - 21:20
 0  17
జాతీయ బాలికల దినోత్సవాన్ని" పురస్కరించుకొని శాంతినికేతన్ పాఠశాలలో ,"నూరు వరాలు" మొక్కను నాటిన  దైద సింధు థెరీసా 
జాతీయ బాలికల దినోత్సవాన్ని" పురస్కరించుకొని శాంతినికేతన్ పాఠశాలలో ,"నూరు వరాలు" మొక్కను నాటిన  దైద సింధు థెరీసా 

మొక్కలను నాటుదాం కాలుష్యాన్ని నిర్మూలిద్దాం 
శాంతినికేతన్ పాఠశాల 
 ప్రధాన చార్యులు రోహిణి.

హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ జాతీయవ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్  శివం హిల్స్ బ్రాంచ్  బొమ్మల గుడి ఏరియా గల శాంతినికేతన్  బ్లూమ్స్ పాఠశాలలో 4వ తరగతి విద్యనభ్యసిస్తున్న దైద సింధు తెరిసా అదే పాఠశాల ఆవరణలో ప్రధాన ఆచార్యులు రోహిణి చేతుల మీదుగా విద్యార్థిని దైద సింధు తెరిసాకు  గ్రీన్ టవల్ అలంకరించి హరిత దీక్ష ప్రారంభించి నూరు వరాల మొక్కను నాటారు.ఈ సందర్భంగా ప్రధాన చార్యులు రోహిణి మాట్లాడుతూ జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా ఈరోజు  దైద సింధు తెరిసా తల్లిదండ్రులు దైద వెంకన్న అనితలు  పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు మొక్కలు నాటుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య , హరిత మిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న,కొట్టూరి ను ర్వి రాజశేఖర్ వారి నుంచి స్ఫూర్తి పొందిన సింధు తెరిసా ప్రతిరోజు  మొక్కలు నాటి భావితరాలకు ప్రాణవాయువును అందించాలన్నారు   ఆమెకు అభినందనలు తెలిపి ప్రోత్సహించారు ప్రతి ఒక్క విద్యార్థి సింధూను ఆదర్శంగా తీసుకోవాలన్నారు  దైద వెంకన్న మాట్లాడుతూ సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరం విరివిగా మొక్కలు నాటి పచ్చదనం నిర్మించాలన్నారు "సేవ్ నేచర్ గ్రీన్ వరల్డ్" అనే నినాదంతో మొక్కలను నాటి కాలుష్యాన్ని నివారించాలన్నారు భావితరాలకు ఆస్తులు అంతస్తులు కాకుండా స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలన్నారు పుట్టినరోజు,వివాహ దినోత్సవం, షష్టిపూర్తి,పదవి విరమణ దినోత్సవం మొదలగునవి శుభకార్యాలకు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవ్య సంగీత జ్యోతి శైలజ కస్తూరి మంజుల బ్రాహ్మణి సంతోష మధు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333