జలాల్ పురం లో పోషణ పక్షం అవగాహన

తిరుమలగిరి 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం లో భాగంగా అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. సూపర్వైజర్ కైరున్నిసా మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు గర్భంలో శిశువు పడ్డప్పటి నుండి జననం వరకు 270 రోజులు గర్భిణి పోషక విలువల ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందని ,బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టిస్తూ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి అన్నారు ఎటువంటి పానీయాలు తాపీయకుండా ఏడవ నెల నుండి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ పోషక ఆహారం మొదలుపెట్టి ప్రతిరోజు బిడ్డ తీసుకునే ఆహారాన్ని మోతాదు పెంచుతూ 24 నెలల వరకు అనగా 2 సంవత్సరాలు 730 రోజులు మొత్తం 1000 రోజుల వరకు జాగ్రత్తగా కాపాడుకుంటే బిడ్డ ఆరోగ్య పోషణ పరిస్థితి చాలా చురుగ్గా ఉంటుంది లేకపోతే లోప పోషణకు గురి అయ్యి శిశు మరణాలకు దారితీస్తుంది. గర్భస్థ శిశువు నుండి రెండు సంవత్సరాల వరకు ఈ 1000 రోజులు చాలా ముఖ్యమైనది అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ టీచర్లు మమత, కస్తూరి, అంగన్వాడీ టీచర్లు శాంత,.రేణుక ,మాధవి.రేణుక అంగన్వాడి హెల్పర్ రాణి తదితరులు పాల్గొన్నారు