జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ గా ఎర్ర యాదగిరి

తిరుమలగిరి 17 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్, అభియాన్, మండల కోఆర్డినేటర్ గా తాటిపాముల గ్రామానికి చెందిన ఎర్ర యదగిరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ ఎన్నికకు సహాకరించింన తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మండల అధ్యక్షులు ఎల్సోజ్ నరేష్ కు నా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ తిరుమలగిరి మండల కోఆర్డినేటర్ గా నాపైన పెట్టిన బాధ్యతను ప్రజలలోకి తీసుకెల్లి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్, కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించి ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తాను అని అన్నారు . ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావతు జుమ్మిలాల్ నాయక్, జిల్లా యువజన ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, తుంగతుర్తి నియోజక వర్గం యువజన సంఘం ఉపాధ్యక్షులు బాకీ సజ్జన్, మండల యువజన అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, తుంగతుర్తి ప్రెస్ క్లబ్ ఇన్చార్జి కందుకూరి లక్ష్మయ్య, మండల యువజన ఉపాధ్యక్షులు బోoడ్ల వంశీ, పేరాల నరేష్,వార్డు ఇన్చార్జి పత్తేపురం సుధాకర్, మల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు నాయిని కృష్ణ, భాస్కర్, రామోజి,శ్రీనివాస్, కిషన్, గదరా బోయిన లింగయ్య, బిచ్చ నాయక్, గజ్జి లింగయ్య,రాకేష్, జటోతు మోహన్, లకుపతి,యాకయ్య,నరేష్ తదితరులు నాయకులూ పాల్గొన్నారు.