చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సు ను విజయ వంతం చేయండి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సు ను విజయ వంతం చేయండి. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ గడ్డం కాశీం ఈనెల 14న సూర్యాపేట జిల్లా కేంద్రంలోగాలి వీరయ్య, వీరభద్రమ్మ ఫంక్షన్ హాల్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ దారులు జిల్లా సదస్సులువిజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి గడ్డం కాసిం అన్నారు. శనివారం మండల కేంద్రంలో మండల ఇన్చార్జి బండి మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 4016నుండి 6016 పెంచాలని అదేవిధంగా ఆసరా పెన్షన్ దారులైన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కల్లుగీత కార్మికులకు 2016 రూపాయల నుండి 4016 రూపాయలకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లో నిర్వహించే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సు కు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ హాజరు హాజరు కానున్నారు అని మండల చేయిత పింఛన్ దారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చింత సతీష్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి జహీర్ బాబా, సీనియర్ నాయకులు కొప్పుల కళింగ రెడ్డి, తిప్పర్తి బిక్షం, దారమళ్ళ నగేష్, నాయకులు పగిడోజు జానకి రాములు, మానపురి సత్యనారాయణ, ములకల పల్లి వెంకన్న, పాండవుల లింగయ్య, బూడిద రామచంద్రుడు, జానిమియా, బత్తుల జంపయ్య సైదులు, దొండ వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.