జన గణన కార్యక్రమం విజయవంతం చేయాలి
తిరుమలగిరి 19 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీలోని అనంతరం మోడల్ స్కూల్ నందు 16 వ భారత దేశ జనాభా గణన కార్యక్రమములో భాగంగా తిరుమలగిరి పురపాలక సంఘ పరిధికి చెందిన జనాభా గణనకు ఏనుమరేటర్లు మరియు సూపర్వైజర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఛార్జ్ ఆఫీసర్ మాట్లడుతూ ఈ ట్రైనింగ్ 3 రోజులు నిర్వహిస్తామని, జనాభా గణన కార్యక్రమములో పరస్పర సహకారంతో జన గణన కార్యక్రమమును విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు సెల్ఫ్ ఏనుమరేషన్ ద్వారా జన గణన హౌస్ లిస్టింగ్ లో తేదీ.26.04.2026 నుండి తేదీ.10.05.2026 వరకు నమోదు చేసుకోగలరని తెలిపారు.
ఈ కార్యక్రమములో ఛార్జ్ అధికారి మరియు మునిసిపల్ కమీషనర్, MEO తిరుమలగిరి, ఫీల్డ్ ట్రైనర్లు, ఏనుమరేటర్లు, సూపర్వైసార్లు మరియు మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు