చలివేంద్రం ప్రారంభం

తిరుమలగిరి 21 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
జిల్లా కలెక్టర్ సూర్యాపేట జిల్లా ఆదేశాల ప్రకారము తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామపంచాయతీ ఎక్స్ రోడ్ యందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాజర్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీ ఏ. భీమ్ సింగ్ గారు , మండల కార్యదర్శులు మరియు వెలిశాల గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.