చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్..
శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులు షాక్..
హనుమకొండ జిల్లా: రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు,108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది,పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికిలాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి.అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటలు సేపు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు.